ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు.బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు పెంబల్ల జానయ్య ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పెంబల్ల జానయ్య మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణకు ఖడ్గం ఎత్తిన వీరుడు,స్వరాజ్య స్వప్నానికి ప్రాణం పోసిన మహానేతగా శివాజీ మహారాజ్ నిలిచారని కొనియాడారు. అన్యాయానికి ఎదురు నిలిచిన ఆత్మగౌరవ ప్రతీకగా ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు, మండల కమిటీ సభ్యులు,జిల్లా నాయకులు,బూత్ అధ్యక్షులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply