Katan Pally | బాల్క సుమన్ అరెస్ట్

Katan Pally | బాల్క సుమన్ అరెస్ట్

Katan Pally | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని క్యాతన్ పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పై దాడి కేసులో బాల్క సుమన్ ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేందుకు వెళ్తున్న పోలీసులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.

బాల్క సుమన్ ఇంటి గేట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బాల్క సుమన్ ఇంటి గేట్లను బలవంతంగా ఓపెన్ చేశారు. ఇంట్లో ఉన్న బాల్క సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంత్రి వివేక్ కాన్వాయ్ పై బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాల్క సుమన్ ను అరెస్టు చేశారు.

Leave a Reply