Accident | జైపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం..

Accident | జైపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం..
- మల్లన్న దర్శనానికి వెళ్తూ విషాదం..
- మంచిర్యాల దంపతులు మృతి
Accident | జైపూర్, ఆంధ్రప్రభ: జైపూర్ మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన బోర్వెల్స్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వేలాల మల్లన్న దర్శనానికి వెళ్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం ఖాసీం పల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన వారు మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ సంగమల్లయ్య పల్లెకు చెందిన బెతోజు నారాయణ, బారతమ్మ దంపతులుగా పోలీసులు గుర్తించారు. బుధవారం ఉదయం సీసీసీ నుంచి వేలాల వైపు ద్విచక్ర వాహనంపై బయలుదేరిన వీరు, ఇందారం ఖాసీం పల్లె ఫ్లైఓవర్ పై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన బోర్వెల్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణ, బారతమ్మలు నుజ్జునుజ్జై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
