NTR Varsity :   త్వరలో పబ్లిక్​ హైల్త్​ కోర్స్ Andhra Prabha News​

NTR Varsity :   త్వరలో పబ్లిక్​ హైల్త్​ కోర్స్ Andhra Prabha News​

ఇక ఆరోగ్యరంగంలో ఏఐ వినియోగం

ఎన్టీఆర్​ వర్సిటీ సర్వసన్నద్ధం

గేట్స్ ఫౌండేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం

బిల్ గేట్స్ రాకతో  సీఎం చంద్రబాబు ప్రకటన అమలు

సింగపూర్ వర్శిటీతో  త్వరలో ఒప్పందం

-డీఎంఐడీసీ సాపనలో కీలక నిర్ణయం

-‘రోడ్డు మ్యాప్’ తయారీకి అధికారులు రెడీ -‘అవేర్’తో సైతం అనుసంధానం  

( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్​ ప్రతినిధి)

విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కేంద్రంగా డీసిజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సెంటర్ (డీఎంఐడీసీ) స్థాపించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వం, గేట్  ఫౌండేషన్ మధ్య వూహ్యాత్మక భాగస్వామ్యంతో ఆరోగ్య రంగంలో ఏఐ సాయంతో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

అమరావతికి బిల్ గేట్స్ రాక సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అమలుపై రాష్ట్ర మంత్రి  సత్యకుమార్ ఉన్నతాధికారులతో చర్చించారు. తదుపరి చర్యలో భాగంగా వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్  ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి చంద్రశేఖర్, రీసెర్చి అండ్ డెవలప్​ మెంటు డైరెక్టర్ సూర్యప్రభ, రిజిస్ట్రార్ సాయిసుధీర్, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ అదనపు, సంయుక్త సంచాలకులు సుబ్రహ్మణ్యేశ్వరి, మల్లీశ్వరిలతో సచివాలయంలో మంగళవారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఇందులో డీఎంఐడీసీ ఏర్పాటు ఎలా ఉండాలి? నియామకాలు ఎలా చేపట్టాలి? కార్యకలాపాలు ఎలా ఉండాలి? ఇతర చర్యలు ఎలా ఉండాలన్న దానిపై ప్రధానంగా చర్చించారు.

పబ్లిక్ హెల్త్ కోర్సు ప్రారంభం?!

ప్రాథమికంగా నిర్ణయించిన ప్రకారం..సింగపూరులోని నేషనల్ యూనివర్శిటీలో ఉన్న ‘పబ్లిక్ హెల్త్’ డిపార్టుమెంటుతో ఎన్టీఆర్ వర్శిటీ ఒప్పందం చేసుకుంటుంది. ఇప్పటికే సింగపూర్ వర్శిటీలోని ‘పబ్లిక్ హెల్త్’ డిపార్టుమెంటుతో గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాన్ని చేసుకుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీ కూడా ఒప్పందం చేసుకోనుంది. దీనివల్ల సాంకేతిక సాయం సింగపూర్ వర్శిటీ నుంచి లభిస్తుంది. డీఎంఐడీసీ సాపనలో భాగంగా ఆరోగ్య రంగంలో వివిధ విభాగాల నిపుణుల నియామకాలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ఆసుపత్రులకు ఎటువంటి కేసులు వస్తున్నాయన్న సమాచారం డీఎండీసికి ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకుంటారు.

ఇందులో కమ్యూనికబుల్స్, నాన్-కమ్యూనికబుల్స్ డీసిజెన్, ఇతర వ్యాధుల సమాచారం డీఎంఐడీసీ ద్వారా ప్రభుత్వానికి వెళుతుంది. భవిష్యత్లో క్రమంగా మాతా, శిశు సంరక్షణ, ఇతర కేటగిరిలోనూ డీఎంఐడీసీ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రిడక్షన్, ప్రివెన్షన్, యాక్షన్ ప్రతిపాదికన డీఎంఐడీసీ ద్వారా వైద్య ఆరోగ్య, ఇతర శాఖలకు సమాచారం వెళ్తుంది. ఆరోగ్య వర్శిటీ ద్వారా ‘మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్’లో రెండేళ్ల వ్యవధి కలిగిన కోర్సును ప్రారంభించడంపైనా సమావే శంలో చర్చించారు.

ఇప్పటికే సీజనల్ డీసిజెసెస్​ ను  రియల్ టైములో పర్యవేక్షించి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడానికి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్జీజీఎస్)లోని ‘అవేర్’ (అడ్వాన్స్డ్ వార్నింగ్ అడ్వైజరీ ఫర్ రిసిలియెంటు ఎకో సిస్టమ్) సేవలను వైద్య ఆరోగ్య శాఖ వినియోగించుకునే చర్యలు తుది దశకు చేరుకున్నాయి. అవేర్ సాంకేతికను డీఎంఐడీసీకి అనుసంధానం చేస్తారు. అంతేకాకుండా..ఉన్నత సాయిలో డీఎంఐడీసీకి అనుగుణంగా పలు కమిటీలు ఏర్పడతాయి,

Leave a Reply