వార్డు సభ్యులు పంచాయతీలకు, ప్రజలకు వారధిగా పని చేయాలి….

వార్డు సభ్యులు పంచాయతీలకు, ప్రజలకు వారధిగా పని చేయాలి….

ఊట్కూర్, ఆంధ్రప్రభ : వార్డుసభ్యులు గ్రామపంచాయతీలాలకు ప్రజలకువారధిగా పనిచేయాలని ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ రైతు వేదిక భవనంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల చేత ఎన్నుకోబడిన వార్డు సభ్యులు తమ పరిధిలో నెలకొన్న సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కీలకపాత్ర వహిస్తే లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందన్నారు.

వార్డు సభ్యులు తమ వార్డు పరిధిలో రోడ్లు డ్రైనేజీలు విధి దీపాలు తాగునీటి వసతి కల్పించేందుకు వేక్షించాలన్నారు. వార్డు సభ్యులకు సమస్యలను అవసరాలను గ్రామసభలు పంచాయతీ సమావేశం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో ప్రధాన సమస్యలు గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేపట్టేందుకు తీర్మానించాలన్నారు. వార్డు సభ్యులు సమస్యల పరిష్కారంతోపాటు పన్నుల వసూలు గ్రామపంచాయతీలకు వచ్చే ఆదాయ వనరుల వసూళ్లకు సహకరించాలన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి నాంది పథకాలు అన్నారు.

అనంతరం టి ఓ టి లు తిమ్మప్ప నరసింహారెడ్డి రవికుమార్ స్వామినాథ్ వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ కొండన్న, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేష్, జూనియర్ అసిస్టెంట్ జగదీష్ ఆయా గ్రామాల వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply