Minister | మాది తెలంగాణ ఉద్యమకారుల జాతి…

Minister | మాది తెలంగాణ ఉద్యమకారుల జాతి…
- మీది విద్రోహుల జాతి
Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఎవరు ఔనన్నా… కాదన్నా… నా తండ్రి తెలంగాణ సాధించిన హీరోనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కేసీఆర్ పై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.
తెలంగాణలో రెండే జాతులున్నాయన్నారు. మాది తెలంగాణ ఉద్యమకారుల జాతి… మీది విద్రోహుల జాతి అన్నారు. ఉద్యమంలో పాల్గొనని వారికి జాతి గురించి ఏం తెలుస్తుందని అన్నారు. ఎవరికి జాతిపిత అని కొందరు మాట్లాడుతున్నారన్నారు. స్వరాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ జాతి మాది అన్నారు. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి మాది కాదన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ జాతిపిత అని ప్రజలు భావిస్తున్నారన్నారు.
