Nalgonda l వానరానికి అంత్యక్రియలు.. పాల్గొన్న గ్రామప్రజలు..

Nalgonda l వానరానికి అంత్యక్రియలు.. పాల్గొన్న గ్రామప్రజలు..
Nalgonda, గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో విద్యుత్ షాక్ తో వానరం మృతి చెందడంతో గ్రామస్తులతో కలిసి సోమవారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహించాలని తెలపడంతో సర్పంచ్ నామని జగన్నాథం ఆధ్వర్యంలో వానరం మృతదేహాన్ని ఊరేగించి స్మశాన వాటికలో పూడ్చిపెట్టారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య, వార్డు సభ్యులు లడే యాదయ్య, పెద్దగాని నరేందర్, మొద్దు గణేష్, పున్న ఆనంద్, జూలూరు పురుషోత్తం, యిడం గణేష్, పున్న కిషోర్, పున్న శివ, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
