Accident | శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సు బోల్తా…

Accident | శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సు బోల్తా…
రక్షణ గోడను ఢీ కొట్టి బోల్తా…
పక్కన లోయ లేకపోవటం తో పెద్ద ప్రమాదం తప్పింది..
Accident | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభః నంద్యాల జిల్లాలోని శ్రీశైలం లో వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్థం వస్తున్న ఆర్టిసి బస్సు ఘాట్ రోడ్లో ప్రమాదానికి గురైన సంఘటన చోటు చేసుకొంది. నంద్యాల జిల్లా లోని డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం కు వెళ్తుండగా ఘాట్ రోడ్డు చేరుకోగానే మలుపు వద్ద రక్షణ గోడ ను డి కొట్టి ఒక పక్కకు పూర్తిగా ఓరిగిపోయింది. అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు జీపులో ఉన్నవారు ప్రయాణికులకు భరోసా కల్పించారు. వారు ప్రయాణిస్తున్న బస్సు అద్దాలను పగలగొట్టి బస్సులో ప్రయాణిస్తున్న 30 మందిని క్షేమంగా బయటికి తీశారు.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో లోయ లేకపోవడం రక్షణ గోడ పక్కనే కొండ ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న వారిని సురక్షితంగా కిటికీల ద్వారా బయటికి రప్పించారు. బస్సులో ఉన్న ప్రయాణికులు జరిగిన సంఘటనలో కేకలు వేయటం భయాందోళన కు గురి కావటం జరిగింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యా యి.స్వల్ప గాయాలైన ప్రయాణికులకు శ్రీశైలం లోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాట్ సెక్షన్ లో ప్రయాణిస్తున్న బస్సులో వాహన డ్రైవర్ల ప్రమాదంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా రు.
