Bill Gates Surprised  : వావ్​ బనానా Andhra Prabha SPL News

Bill Gates Surprised  : వావ్​ బనానా Andhra Prabha SPL News

అరటి తోటలో .. బిల్​ గేట్స్​ పులకరింత

అన్నదాతలతో మాటామంతీ

  ఏఐ, అగ్రిటెక్ సేవలు అత్యద్భుతం

 సాగులో యాప్, డ్రోన్ల వినియోగం పరిశీలన

( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి)

Bill Gates Surprised

 వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతిక వినియోగం, ఏఐ ఆధారిత రైతు సేవలను గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ( Bill Gates  Surprised) ముఖ్యమంత్రి చంద్రబాబు (Ap Cm Chandrababu) తో కలిసి స్వయంగా పరిశీలించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని(Banana Garden) సోమవారం సందర్శించిన గేట్స్‌కు రైతుల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచే కార్యక్రమాలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వివరించారు.

Bill Gates Surprised

 వ్యవసాయం-అనుబంధ రంగాల్లో దిగుబడి పెంపు, సాగు ఖర్చు తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలిపారు. అలాగే నాణ్యమైన పంట ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక కార్యాచరణ అవలంభించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో అనలిటిక్స్, మానిటరింగ్ డాష్‌బోర్డులు వినియోగిస్తున్నామని వెల్లడించారు.

Bill Gates Surprised

ఈ సందర్భంగా మహిళా రైతులు మణి, అన్నపూర్ణ… ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించిన ఏపీఏఐఎంఎస్  రైతు యాప్‌ గురించి గేట్స్‌కు తెలియజేశారు. ఈ యాప్ ద్వారా ఏ పంటలు పండించాలి, సాగునీటి నిర్వహణ, నేల స్వభావం, ధరలు, మార్కెట్ సమాచారం, పురుగు మందుల నియంత్రణ వంటి విషయాలు సులభంగా తెలుసుకుంటున్నామని చెప్పారు. ఏఐ ద్వారా పంట తెగుళ్ల గుర్తింపు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే డ్రోన్ సేవలు పొంది పురుగు మందులను వినియోగిస్తున్న తీరును తెలిపారు.

Bill Gates Surprised

 బిల్ గేట్స్ సమక్షంలోనే రైతులు ఏఐ టూల్ ఉపయోగించి, వ్యాధి సోకిన మొక్క ఫోటో తీసి అప్లోడ్ చేశారు. ఆ వ్యాధిని ఏఐ గుర్తించి నివారణ సూచనలు అందించింది. అనంతరం డ్రోన్ సేవను బుక్ చేయగా, మొక్కకు వ్యాధి వ్యాపించిన చోట డ్రోన్ స్ప్రే చేసింది. ఇది స్వయంగా చూసిన బిల్ గేట్స్… రైతులకు ఏఐ-అగ్రి టెక్ సేవలు అత్యద్భుతంగా అందిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

Bill Gates Surprised

మరోవైపు స్థానిక రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. మొదటగా వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. వారు స్వయంగా వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. ఈ సందర్భంగా సేంద్రీయ సాగు పద్దతులతో పండించిన ఉత్పత్తులను బిల్ గేట్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

BALSO READ : Bill Gates Appraciaton  :   వెరీ గుడ్​..గ్రేట్​ వర్క్​  Andhra Prabha Spot News

ఫోటో గ్యాలరీ  Photo Gallary

Bill Gates Surprised
Bill Gates Surprised
Bill Gates Surprised
Bill Gates Surprised
Bill Gates Surprised
Bill Gates Surprised
Bill Gates Surprised
Bill Gates Surprised
Bill Gates Surprised
Bill Gates Surprised
Bill Gates Surprised
Bill Gates Surprised

Leave a Reply