Aleru | రోడ్డు ప్రమాదం..

Aleru | రోడ్డు ప్రమాదం..
Aleru, ఆంధ్రప్రభ : వరంగల్ నుండి తూర్పుగూడెంకు వెళ్తున్న టయోటా క్వాలిస్ వాహనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శివారులలోని జెఎస్ఆర్ ఎంక్లేవ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న మల్లికాంబ (48) మృతి చెందింది. లక్ష్మమ్మ, లక్ష్మీనారాయణ, శంకర్, లలిత ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది ఈఎంటి బిల్ల రాజు, నరేష్ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని జనగాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
