సాలెవాడ(కే )లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఆదివారం ప్రజలు భక్తులు మహాశివరాత్రి వేడుకలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండలంలోని సాలెవాడ (కె ) లోని మహాదేవ్ శివాలయంలో వందలాదిమంది భక్తులు తరలివచ్చి శివరాత్రి వేడుకల్లో పాల్గొని శివునికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శివాలయం ముందు శివుని ఆశీస్సులు కోసం పెద్ద సంఖ్యలో వరస లో నిలబడి శివాలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు చేసి శివుని ఆశీస్సులు పొందారు. ఈ వేడుకల్లో సాలెవాడ కె నూతన సర్పంచ్ చిక్రం తులసిరామ్, మాజీ ఎంపీటీసీలు సాల్గరే రవీందర్,కందుకూరి రమేష్, బిజెపి నాయకులు బంక మధుకర్, ఇతర పార్టీల నాయకులు, ఉద్యోగులు, ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply