పేకాటాడిన 8 మందిపై కేసు నమోదు..

పేకాటాడిన 8 మందిపై కేసు నమోదు..

రూ.7వేల నగదు.. ఓ ఆటో స్వాధీనం..

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ సమీపాన మామిడి తోటలో పేకాడుతున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ మంగళవారం తెలిపారు. కొంతమంది పేకాడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు కిష్టాపూర్ గ్రామ సమీపాన ఉన్న మామిడి తోటలో సోమవారం రాత్రి దాడి చేశామన్నారు.

ఈ దాడిలో పేకాడుతున్న కిష్టాపూర్ కు చెందిన వాసాల రవి, గోనె మురళి, కోల రాజేష్, భూక్య రాజులను అదుపులోకి తీసుకోగా, అదే గ్రామానికి చెందిన సురమల్ల ప్రకాష్, పోతుగంటి వెంకటేష్, చింతల రాజకుమార్, మన్నెగూడవాసి గంధం విజయరావు పరారైనట్లు ఆయన చెప్పారు. ఆ నిందితుల నుంచి రూ.7040 నగదు, 4 సెల్ ఫోన్లు, ఒక్క ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply