Cancer | ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి…

Cancer | ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి…

Cancer | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, పత్తికొండ నివాసి నాగరాజు తీవ్రమైన ఎముకల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం పూర్తిగా పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు, నాగరాజు తనను ప్రభుత్వం ఆదుకోవాలి అని నిరవధిక దీక్ష చేపట్టారు. వారికి కర్నూలు జిల్లా అధ్యక్షులు క్రాంతి నాయుడు బోయ మద్దతు తెలిపి వారు మాట్లాడుతూ ముప్పై నాలుగు ఏళ్ళ యువకుడు ఇద్దరు చిన్న కుమారులతో కుటుంబానికి స్థిరమైన ఆదాయం లేకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటివరకు ఆయనకు ప్రభుత్వ పింఛన్ మంజూరు కాలేదని తెలిసి ఎంతో బాధ కలిగింది అని అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అత్యవసరంగా పరిగణించి సంబంధిత అధికారులు తక్షణమే వికలాంగ,ఆరోగ్య పింఛన్ మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వ వైద్య పథకాల కింద పూర్తి చికిత్స మరియు అవసరమైన ఆర్థిక సహాయం అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించి వారికి సదుపాయాలు కల్పించాలి అని కోరారు. మానవత్వ దృక్పథంతో ప్రభుత్వం స్పందించి నాగరాజు కుటుంబానికి భరోసా కల్పించాలని విన్నవించారు.

Leave a Reply