యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి…

యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి…

ఈగల్ చీఫ్ ఐజీ రవికృష్ణ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వేసవికాలంలో రక్త కొరతను దృష్టిలో ఉంచుకుని యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. కర్నూలు కలెక్టరేట్ సమీపంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్‌లో శనివారం ఈగల్ టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐజీ రవికృష్ణ ప్రారంభించారు.


ఈ సందర్భంగా కెవి సుబ్బారెడ్డి కళాశాలకు చెందిన 28 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం తలసేమియా రక్త మార్పిడి కేంద్రాన్ని పరిశీలించిన ఐజీ, అక్కడ చికిత్స పొందుతున్న పిల్లల పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తలసేమియా బాధితులైన ఆరుగురు చిన్నారులకు రక్త మార్పిడి నిర్వహించారు.


రక్తదానం ప్రాణాలను కాపాడే మహత్తర సేవ అని పేర్కొంటూ, సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని సూచించారు. ముఖ్యంగా యువత రక్తదానం పట్ల చైతన్యం పెంపొందించుకోవాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు జిల్లా బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవింద రెడ్డి, వైస్ చైర్మన్ కె అరుణ, ట్రెజరర్ ఐ నరసింహ, టు టౌన్ సిఐ నాగరాజారావు, కమిటీ సభ్యులు జి శ్రీనివాస్ యాదవ్, ఎం జె బాబు రాజు, కెవి సుబ్బారెడ్డి, మెడికల్ ఆఫీసర్లు బి కుమారస్వామి రెడ్డి, జి రామచంద్రరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply