Revenue | దామోదరం సంజీవయ్య జీవితం స్పూర్తిధాయకం..

Revenue | దామోదరం సంజీవయ్య జీవితం స్పూర్తిధాయకం..
Revenue | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ మీటింగ్ హాల్ లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవిన్యూ అధికారి కే.చంద్రశేఖర రావు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
