33 వార్డుల ఫలితాలు వెల్లడి..

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించగా, మొత్తం 33 వార్డులలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. కొన్ని వార్డుల్లో స్వల్ప మెజార్టీలు, మరికొన్ని వార్డుల్లో భారీ మెజార్టీలతో అభ్యర్థులు విజయం సాధించారు.
మొత్తం 33 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందగా, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొన్ని వార్డుల్లో విజయం సాధించారు.
వార్డు వారీగా విజేతలు – మెజార్టీలు
- కాంగ్రెస్ – చుక్క రాజు (326)
- కాంగ్రెస్ – బి. రమాదేవి (177)
- కాంగ్రెస్ – చీర్ల రజినీ చందర్ (570)
- కాంగ్రెస్ – గంధం శరవంద (34)
- కాంగ్రెస్ – బాపన్పల్లి వెంకటేష్ (61)
- కాంగ్రెస్ – పితాంబరం (394)
- కాంగ్రెస్ రెబెల్ – కదిరే నాగమ్మ
- బీఆర్ఎస్ – మూడవత్ శంకరమ్మ (243)
- కాంగ్రెస్ – విభూది మహేశ్వరి
- కాంగ్రెస్ – మధుసూదన్ గౌడ్ (301)
- బీఆర్ఎస్ – డి. స్వాతి (33)
- కాంగ్రెస్ – నక్క రాణి (34)
- కాంగ్రెస్ – బి. పరశురామ్ (106)
- కాంగ్రెస్ – పుట్టొజు శారద బ్రహ్మం (72)
- కాంగ్రెస్ – ఏర్వ సౌమ్య (517)
- బీఆర్ఎస్ – ఎ. సిద్ధిఖా (74)
- బీజేపీ – డి. నిర్మలా (200)
- సీపీఎం – మదన్ (330)
- బీఆర్ఎస్ – మురళి సాగర్ (229)
- కాంగ్రెస్ – పాకనాటి కృష్ణా (178)
- కాంగ్రెస్ – ధనలక్ష్మి
- బీఆర్ఎస్ – ఏర్వ అరుణ (230)
- బీఆర్ఎస్ – పలుస శ్రీకర్ గౌడ్
- బీఆర్ఎస్ – శిరీష రమేష్ గౌడ్ (16)
- ఇండిపెండెంట్ – ఏర్పుల రవి యాదవ్ (68)
- బీజేపీ – విజయ్ కుమార్ (33)
- కాంగ్రెస్ – జంగిడి సరిత రవి (200)
- కాంగ్రెస్ – కోట్ల శిరీష
- బీఆర్ఎస్ – పోలీస్ భారతి (183)
- కాంగ్రెస్ – రాచాల క్రాంతి గౌడ్ (120)
- కాంగ్రెస్ – బండారు విజయలక్ష్మి (300)
- కాంగ్రెస్ – అరుణ జ్యోతి (67)
- కాంగ్రెస్ – ఎస్ఎల్ఎన్ మాధవి (140)
ఇండిపెండెంట్గా గెలిచిన కొంతమంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. బి-ఫారం సమయానికి అందకపోవడంతో వారు ఇండిపెండెంట్ గుర్తుతో పోటీ చేసి విజయం సాధించారు.
మొత్తంగా 33 వార్డుల ఫలితాలు పరిశీలిస్తే, వనపర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసి పట్టణ పాలనలో కీలక పాత్ర పోషించనున్నట్లు స్పష్టమైంది.
