525 communities | మార్చి 19న ఢిల్లీలో ముగింపు

525 communities | మార్చి 19న ఢిల్లీలో ముగింపు

525 communities | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయ కిసాన్ జాగృతి యాత్రకు కిసాన్ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఏ సూర్య ప్రకాష్ రెడ్డి తెలియజేశారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బి క్రాంతి నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం ఎస్టియు భవన్ లో జరిగిన అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ కిసాన్ జాగృతి యాత్ర ఫిబ్రవరి 7న ప్రారంభమై కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశ వ్యాప్తంగా 40 రోజులు చేపట్టి మార్చి 19న ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో ముగింపు సభ ఉంటుంద‌న్నారు.

ఈ యాత్రలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి జాతీయ రైతు సంఘం నాయకులు ఈ యాత్రకు రావడం జరుగుతుంద‌న్నారు. ఢిల్లీలో రైతు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున సంయుక్త కిసాన్ మోర్చా 525 సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు ఉద్యమం 13 నెలలు జరిగింద‌న్నారు. ఆ ఉద్యమంలో జాతీయ రైతు నాయకులు జల్దీర్ సింగ్ జలేవాల 130 రోజులు నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చింద‌ని చెప్పారు.

525 communities |

మరల బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు గడచినా రైతు సమస్యలు అమలు చేయని కారణంగా అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ కిసాన్ జాగృతి యాత్ర చేపట్టవలసి వ‌చ్చింద‌న్నారు. ప్రధాన డిమాండ్లు వ్యవసాయ రంగానికి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని రైతులు పండించిన అన్ని రకాల పంటలకుC2+50 శాతం గిట్టుబాటు ధరలు కల్పించి ఆ ధరలను చట్టబద్ధం చేయాలన్నారు.

2023 విద్యుత్ సవరణ చట్టాలను రద్దుచేసి ఉచిత విద్యుత్ విధానాన్ని అమలు చేయాలని, 2025 విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, విబిజీ రాంజీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలన్నారు. జాతీయ కిసాన్ జాగృతి యాత్ర చేపట్టడం జరుగుతుందని సూర్యప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ జగ్జిత్ సింగ్ దళివాల, రాజస్థాన్ ఇందర్జిత్ ఫన్నీ వాళ, హర్యానా అభినయ కోహర్, మధ్యప్రదేశ్ అరుణ్ పటేల్, పంజాబ్ సోను అలోక్, కర్ణాటక నాగరాజ్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply