బాల్య వివాహలు నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత..

బాల్య వివాహలు నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత..
- హసన్ పర్తి తహసీల్దార్ కిరణ్ కుమార్
హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : బాల్య వివాహలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని,నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యతని హసన్ పర్తి తహసీల్దార్ పుజారి కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో, మహిళ శిశు సంక్షేమ శాఖ,షేర్ ఎన్ జీఓల సంయుక్త ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన అవగాహనకై ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని తహసీల్దార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చేస్తే మాతృ మరణాలతో పాటు శిశు మరణాలు సంభవిస్తాయని అన్నారు. బాలికల పుట్టిన తేదీలను మార్చి వివాహాలు చేస్తే సమాచారం అందించాలని అన్నారు.
గ్రామాల్లో నూతనంగా ఎంపికైన సర్పంచులు, బాల్య వివాహాలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు.బాల్య వివాహలకు పాల్పడిన వారికి రెండు సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా ఉంటుందని హెచ్చరించారు.బాల్య వివాహలు అరికట్టేందుకు కృషి చేయడంతో పాటు బాలబాలికల తల్లిదండ్రులకు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమలో ఎంపీడీఓ సుమణ వాణి ఆర్ఐలు ఫాజిల్, రాజేంద్రప్రసాద్,షేర్ ఎన్ జీఓ జిల్లా కో -ఆర్డినేటర్ లు టీ శిరీష, జమున, జ్ఞానేశ్వరి, జగన్,చామంతి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
