Bangladesh|ఇంటికి పంపించేశారు..

Bangladesh|ఇంటికి పంపించేశారు..

  • అరాచ‌క పాల‌న‌కు స్వ‌స్తి
  • బంగ్లాదేశ్‌లో ముగిసిన యూనస్ శకం
  • తాజా ఎన్నికల్లో ప్రజల తీర్పు
  • తారిక్ రెహమాన్‌ పాలనను కోరిన బంగ్లాదేశీయులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, వెబ్‌డెస్క్ : బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ రాక్షస పాలన అంతమైంది. ఆ దేశంలో మైనార్టీలను ఊచకోత కోసిన యూనస్ ఇక ఇంటికే పరిమితం కానున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని అక్రమ మార్గాల్లో గద్దె దింపి అధికారంలోకి వచ్చిన మహ్మద్ యూనస్ ఆ దేశంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా భారత్ నే సవాలు చేసే స్థాయికి వచ్చాడు. అలాంటి యూనస్ ఇప్పుడు అధికార పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా ఆ దేశంలో ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. 299 పార్లమెంట్‌ స్థానాలు ఉన్న బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 150 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. తాజా ఎన్నికల ఫలితాల్లో 212 స్థానాల్లో విజయం సాధించినట్లు బీఎన్‌పీ ప్రకటించింది. 70 సీట్లకు పరిమితమైన జమాత్‌-ఏ-ఇస్లామీ పార్టీ ఓటమిని అంగీకరించింది. బీఎన్‌పీ నాయకుడు తారిఖ్‌ రహ్మాన్‌ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఆ దేశంలో హిందువులకు కాస్తంత ఉపశమనం దొరికిందనే చెప్పుకోవచ్చు. అయితే ఆ దేశానికి కాబోయే ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్ హయాంలో హిందువులు సురక్షితంగా ఉండగలరా? భవిష్యత్తులో బంగ్లాదేశ్ లో ఏర్పడే పరిణామాలేంటి? భారత్ పట్ల ఆ దేశ వైఖరి ఎలా ఉంటుంది? అనేది తెలుసుకోవాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..

తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశీయులు సుస్థిరమైన పాలనకు ఓటేశారు. తారిక్ రెహమాన్ నేతృత్వంలో బీఎన్‌పీకి భారీ విజయాన్ని అందించారు. 299 స్థానాలకు గాను 212 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వానికి ప్రజలు స్వస్తి పలికారు. యూనస్‌కు ప్రజలు గుడ్‌బై చెప్పారు. దీంతో బంగ్లాదేశ్‌లో యూనస్ శకం ముగిసినట్లైంది.

Leave a Reply