Bejjanki | మండల ప్రజలకు పులి సంచారంపై హెచ్చరిక

Bejjanki | మండల ప్రజలకు పులి సంచారంపై హెచ్చరిక
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎసై సౌజన్య
Bejjanki | బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండల శివారు గ్రామం శనిగరం లో పులి సంచరిస్తుందని అటవీశాఖ గుర్తించారని కావున మండల పరిధిలోనికి పులి (పెద్దపులి) ప్రవేశించే ఆస్కారం ఉన్నందున ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ఎసై సౌజన్య సూచించారు. రేగులపల్లి, గుండారం, నర్సింహులపల్లి, పోతారం, గుగ్గిళ్ళ, తిమ్మాయిపల్లి మరియు గాగిల్లాపూర్ గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండవలసిందిగా పోలీసు శాఖ సూచించారు.

ప్రస్తుతం పై గ్రామాల లోపలికి ప్రవేశించినట్లు ఎలాంటి నిర్ధారణ సమాచారం లేదని. అయితే గుట్టల సమీప ప్రాంతాలలో సంచరిస్తున్న అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించడం అత్యవసరం అన్నారు. అవసరం లేకుండా గుట్టల ప్రాంతాలకు, అడవులకు లేదా పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దన్నారు. చిన్నపిల్లలు మరియు పశువులను ఒంటరిగా బయటకు వదిలివేయరాదన్నారు. ఏవైనా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలి పేర్కొన్నారు
