8th ward | ఓటేసి సెల్ఫీ దిగిన 8వ వార్డు అభ్యర్థి…

8th ward | మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి… మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక అంగడి బజార్ లోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన మోడల్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌లో శ్రీ విద్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు సెల్ఫీ దిగి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
