TTA | సేవ‌, సంబ‌రాలే ధ్యేయంగా..

TTA | సేవ‌, సంబ‌రాలే ధ్యేయంగా..

  • యూఎస్‌లో తెలంగాణ అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్
  • సంస్థ‌ను స్థాపించిన పైళ్ల మ‌ల్లారెడ్డి
  • ఈ సంస్థ ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు
  • తెలంగాణ పండ‌గ‌ల నిర్వ‌హ‌ణ‌
  • తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు అండ‌గా
  • సంస్థ ఈసీ మెంబ‌ర్ స్వాతి

TTA | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అమెరికా అంటే గుర్తొచ్చేది ఒక సంస్థ పేరు టీటీఏ. తెలంగాణ అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్ అనే సంస్థ‌ను 2015లో పైళ్ల మ‌ల్లారెడ్డి దీనిని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అమెరికాలో అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంతో పాటు తెలుగు పండ‌గ‌లు బోనాల లాంటివి ఎన్నో ఘ‌నంగా నిర్వ‌హిస్తుంటారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళా వేదిక‌లో చాలా పెద్ద ప్రోగ్రాంను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్య‌మ కారులను స‌న్మానించి వారితో మాట్లాడించారు. అయితే ఈ సంస్ధ గురించి మ‌రికొన్ని విష‌యాలు ఈసీ మెంబ‌ర్ స్వాతి ఆంధ్ర‌ప్ర‌భ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పంచుకున్నారు. తెలంగాణ క‌ళాకారుల‌కు అండగా ఉండేందుకు ఈ టీటీఏను స్థాపించారు.

అలాగే ఈ సంస్థలో 30మంది బోర్డు మెంబ‌ర్స్ ఉంటారు. పైళ్ల మ‌ల్లారెడ్డి స‌హాయంతో ఒక్కొక్క‌రు ఒక్కో స్టేట్ నుంచి ఈ మెంబ‌ర్స్ తెలంగాణ పిల్ల‌ల‌కు మ‌న సంస్కృతి తెలియ‌జేసేలా బోనాలు, వినాయ‌క చ‌వితి, బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తాం. తెలంగాణ పండ‌గ‌ల‌ను మిస్ కావొద్ద‌నే ఆమెరికాలో వీటిని జ‌రుపుకుంటున్నాం. వీకెండ్‌లో ఎక్కువ‌గా పండ‌ల‌ను నిర్వ‌హిస్తాం. ద‌స‌రా, బ‌తుక‌మ్మ‌, ఉమెన్స్ డే, బ్ల‌డ్ డొనేష‌న్ క్యాంపు, కొన్ని సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తాం. ప్రోగ్రామ్స్ కోసం తెలంగాణ క‌ళాకారుల‌ను కూడా తీసుకొస్తుంటాం. 2025 డిసెంబ‌ర్‌లో టీటీఏ 10 ఇయ‌ర్స్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాం. దీనికి ప్ర‌ముఖులు, సినిమా యాక్ట‌ర్లు కూడా వ‌చ్చారు. పైళ్ల మ‌ల్లారెడ్డి ఈ సంస్థ‌ను స్థాపించి ఆద‌ర్శంగా నిలిచార‌న్నారు. ఆమె మ‌రికొన్ని విష‌యాలు ఆంధ్ర‌ప్ర‌భ‌తో పంచుకున్నారు. అవి తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను తిల‌కించండి..

Leave a Reply