Bellampalle | ఆంజనేయస్వామి ఆలయంలో దుర్గం చిన్నయ్య ప్రత్యేక పూజలు..

Bellampalle | ఆంజనేయస్వామి ఆలయంలో దుర్గం చిన్నయ్య ప్రత్యేక పూజలు..
34 వార్డుల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని మొక్కులు..
విజయం తమదేనని ధీమా!
Bellampalle | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం మంగళవారం ప్రారంభమైన వేళ రాజకీయాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు జరిపి, అభ్యర్థులందరికీ విజయం చేకూరాలని మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. హనుమంతుని ఆశీస్సులతో పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తమ అభ్యర్థులను గెలిపిస్తాయని పేర్కొన్నారు. ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి పట్టణ వికాసానికి తోడ్పడే అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు. 34 వార్డుల్లోనూ పార్టీ శ్రేణులు ఐక్యమత్యంతో పని చేశాయని, ఫలితాల్లో బీఆర్ఎస్ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
