Clean | అడగకుండానే అన్నీ చేస్తున్న సర్పంచ్….

Clean | అడగకుండానే అన్నీ చేస్తున్న సర్పంచ్….
Clean | వేంసూరు, ఆంధ్రప్రభ : భీమవరం గ్రామ పంచాయితీ పారిశుద్ధ్య నిర్వహణలో క్లీన్ వైపు పరుగులు పెడుతుంది. గత కొన్నేళ్లగా తిష్ట వేసిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి వైపు సర్పంచ్ వంట్లా రమేష్ అడుగులు వేస్తున్నారు. మంగళవారం డంపింగ్ యార్డ్ క్లీన్ దిశగా చర్యలు చేపట్టారు. గత కొన్నేళ్ళగా పాడైపోయి, మూలపడిన చేతి పంపులు మరమ్మత్తులు చేయించి త్రాగునీటిని గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
మూడు విద్యుత్ మోటార్లు కాలిపోవటంతో నీటి ఎద్దడి పరిస్థితి చక్కదిద్దారు. దోమల తీవ్రత ఉండటంతో రెండు సార్లు ఫాగింగ్ చేపట్టారు. ప్రమాదాలు నివారించేందుకు మూల మలుపులు వద్ద హై వోల్టేజ్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య తీర్చేందుకు పైప్ లైన్ ఏర్పాటు, డ్రైనేజీలో పూడికతీతలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇటీవల సర్పంచ్ వంట్లా రమేష్ అధ్యక్షతన గ్రామసభ జరగగా, సభకు హాజరైన ప్రజలు చప్పట్లు, ఈలలు వేస్తూ, హర్షద్వానాలు వ్యక్తం చేశారు. అడగ కుండానే అన్నీ చేస్తున్న మీకు అన్ని రకాల చేయూత ఇస్తామని ప్రజల పేర్కొనటం విశేషం. సర్పంచ్ రమేష్ కు తోడుగా పంచాయతీ కార్యదర్శి చైతన్య, మండల స్థాయి అధికారుల ప్రోత్సాహకం ఆయనకు కలిసి వచ్చింది.
