3reasons | బంగారం, వెండి ధరల పతనం వెనుక జ్యోతిష్య కారణాలు

3reasons | బంగారం, వెండి ధరల పతనం వెనుక జ్యోతిష్య కారణాలు
3reasons | బంగారం, వెండి ధరల పతనం… అసలు జ్యోతిష్య కారణాలివే!
3reasons | గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూడటం మార్కెట్ వర్గాలను, సామాన్యులను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేసింది.
అంతర్జాతీయ మార్కెట్ సూత్రాలు దీనికి పలు కారణాలు చెబుతున్నప్పటికీ, కాల పురుషుని గడియారం ప్రకారం అంటే జ్యోతిష్య శాస్త్ర రీత్యా (Astrological Perspective) — గ్రహాల సంచారంలో వచ్చిన ఆకస్మిక, శక్తివంతమైన మార్పులే ఈ పతనానికి అసలు కారణమని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం “ఫిబ్రవరి 2026” గ్రహ స్థితులను పరిశీలిస్తే, సువర్ణం (Gold), రజతం (Silver) కారక గ్రహాలు తీవ్రమైన పీడలో ఉండటమే ఈ పరిణామానికి ప్రధాన కారణం. ఆ జ్యోతిష్య విశ్లేషణ ఇదే.
1. వ్యాపార కారకుడిపై రాహువు ప్రభావం (Mercury & Rahu)
మార్కెట్ హెచ్చుతగ్గులను శాసించే వ్యాపార కారకుడు బుధుడు (Mercury). ఈ బుధుడు ఫిబ్రవరి 3న కుంభ రాశిలోకి (Aquarius) ప్రవేశించాడు. అక్కడ ఇప్పటికే తిష్టవేసి ఉన్న ఛాయా గ్రహం రాహువుతో కలవడం ఒక ట్రిగ్గర్ పాయింట్ (Power).
జ్యోతిష్యంలో బుధ–రాహు యోగం ఎప్పుడూ అనూహ్య పరిణామాలకు, ప్రమాదకర ఒడిదుడుకులకు (Negative) దారితీస్తుంది. అదే మార్కెట్‌లో ఒక సడన్ క్రాష్‌ను (Powerful Impact) సృష్టించింది.
2. బంగారం (గురువు)పై రాహు దృష్టి
బంగారానికి కారకుడు బృహస్పతి (Jupiter). ప్రస్తుతం గురువు మిథున రాశిలో (Gemini) సంచరిస్తున్నాడు. కానీ కుంభంలో ఉన్న రాహువు తన పంచమ దృష్టితో (5th Aspect) గురువును చూడటం ఇక్కడ తీవ్రంగా గమనించాల్సిన అంశం .
ఎప్పుడైతే రాహువు వంటి పాప గ్రహ దృష్టి గురువుపై పడుతుందో, అప్పుడు పసిడి ధరల్లో స్థిరత్వం కోల్పోయి . ఒక్కసారిగా భారీ పతనం సంభవిస్తుంది. బంగారం ధరల్లో జరిగిన అకస్మాత్తు తగ్గుదల దీనికి స్పష్టమైన నిదర్శనం.
3. పాప గ్రహాల మధ్య నలిగిన వెండి (Venus in Affliction)
ఇక వెండి విషయానికి వస్తే… వెండికి కారకుడు శుక్రుడు (Venus). ప్రస్తుతం శుక్రుడు మకర రాశిలో ఉన్నాడు. కానీ ఆయన ఒంటరిగా లేడు. అత్యంత ఉష్ణ గ్రహాలైన రవి (Sun), కుజుడు (Mars) తో కలిసి ఉన్నాడు.
అగ్ని తత్వం కలిగిన రవి, కుజుల మధ్య జల తత్వ గ్రహమైన శుక్రుడు ఇరుక్కుపోవడం, అందునా రవికి అత్యంత దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందడం వల్ల వెండి తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది.
అందుకే వెండి ధరలు ఇంతలా తీవ్రంగా ప్రభావితమయ్యాయి
ప్రమాణ శ్లోకం
ఈ గ్రహ స్థితుల ప్రభావాన్ని మహర్షి వరాహమిహిరుడు తన బృహత్సంహిత గ్రంథంలోని ‘అర్ఘ్య కాండం’ లో స్పష్టంగా వివరించాడు.
శ్లోకం:
క్రూరైః పాపైః యుతే దృష్టే సౌమ్యే వా అస్తంగతే సతి |
ధాతునాం రసవస్తునాం అర్ఘహానిః ప్రజాయతే ||
భావం:
శుభ గ్రహాలు (గురువు, శుక్రుడు) క్రూర లేదా పాప గ్రహాలచే (రాహువు, కుజుడు, రవి) దృష్టికి లోనైనా, లేదా అస్తంగత్వం పొందినా… లోహాలు, రస వస్తువుల ధరల్లో తీవ్రమైన హాని , అంటే భారీ తగ్గుదల తప్పక సంభవిస్తుంది.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, రవి కుంభంలోకి మారే వరకు (ఫిబ్రవరి 13) ఈ ఒడిదుడుకులు కొనసాగవచ్చని సూచనలున్నాయి.
వ్యాపారపరంగా ఇది ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగించే పరిణామం అయినప్పటికీ, సామాన్యులకు మాత్రం ధరల తగ్గుదల ఒక ఊరటనిచ్చే, సానుకూల పరిణామం గా మారే అవకాశముంది.

గ్రహాల ఆటలో మార్కెట్ కదలికలు ఎంతటి శక్తివంతమైనవో ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది.
జల్లవరపు సాయి ధీరజ్ శర్మ,
జ్యోతిష పండితులు & పురోహితులు
