distribution | శివ స్వాములకు ఆటో కార్మికుల పండ్ల పంపిణీ

distribution | శివ స్వాములకు ఆటో కార్మికుల పండ్ల పంపిణీ
distribution | అచ్చంపేట, ఆంధ్రప్రభ : శ్రీశైల పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకోవడానికి పాదయాత్రగా వెళ్తున్న శివ స్వాములకు అచ్చంపేట పట్టణంలోని రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం పండ్ల పంపిణీ చేశారు. శివ స్వాములకు ఆహారం, పండ్లు అందించి వారి యాత్రకు సహకారం అందించడం ఎంతో పుణ్యకార్యమని ఆటో కార్మికులు తెలిపారు.
2013 సంవత్సరం నుండి నిరంతరంగా శివ స్వాములకు పండ్ల పంపిణీ చేయడంతో పాటు, పీర్ల పండుగ సందర్భంగా భక్తులకు పానకం పంపిణీ చేయడం వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మహబూబ్ అలీ మాట్లాడుతూ, శివ స్వాముల సేవ చేయడం తమ అదృష్టమని, భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాజా, అశు, ఉస్మాన్, వెంకటేష్, శంకర్, శ్రీనివాసచారి, ముస్తాక్, చందు, హరి సింగ్, అక్బర్, నిరంజన్, షబ్బీర్, షౌకత్, బురాన్, లక్ష్మయ్య, అఖిల్, అజ్జు, కాజా శివ, అశోక్, అక్బర్ చాంద్ పాషా, అజ్జు, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
