Brs l మున్సిపల్ లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పోచంపల్లి కృషి..

Brs l మున్సిపల్ లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పోచంపల్లి కృషి..
పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఇంచార్జీగా సమర్థ నాయకత్వం
అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార ముగింపు వరకూ క్షేత్రస్థాయి పర్యవేక్షణ
అంతర్గత విభేదాలకు వెంటనే పరిష్కారం…పార్టీ ఏకతాటిపై నిలుపుదల
బూత్ ఇంచార్జీలు, వార్డు నాయకులతో నిరంతర సమీక్షలు
ప్రతి అభ్యర్థితో ప్రత్యేక సమావేశాలు…స్పష్టమైన ప్రచార వ్యూహాలు
కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి
Brs l స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ అధిష్టానం మేరకు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ గా వ్యవహరిస్తూ, అభ్యర్థుల ఎంపికలో, కాంగ్రెస్ పార్టీ వైపల్యాలను రెండేళ్లు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవ హరించిన తీరును ప్రజలకు పార్టీ శ్రేణులకు వివరించి వారిలో చైతన్యం నింపారు. టికెట్ల ఖరారు దశ నుంచి ప్రచార ముగింపు కార్యక్రమం వర కు పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా క్షేత్రస్థాయిలో ఆయన విస్తృ తంగా కృషి చేశారు.అభ్యర్థులు, సీనియర్ నాయకులు, యువ నాయ కులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడమే ప్రధాన లక్ష్యంగా పని చేశారు.
టికెట్ పొందిన ప్రతి అభ్యర్థితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వ హిస్తూ ప్రచార వ్యూహాలను రూపొందించారు. బూత్ ఇంచార్జిలు, వార్డు నాయ కులతో నిరంతరం సమీక్షలు చేస్తూ లోటుపాట్లు వెంటనే సరిది ద్దారు. ప్రచారంలో ఎక్కడా అలసత్వం లేకుండా ప్రజల్లోకి వెళ్లి పార్టీ కార్యక్రమాలు, అభ్యర్థుల బలాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల తలెత్తిన అసంతృప్తులను, అంతర్గత భేదా లను సమయానికి పరిష్కరించడం ద్వారా పార్టీ ఏకతాటిపై నిలిచే లా చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టి పార్టీ ప్రయోజనాలే ప్రధానంగా పనిచేయాలన్న దిశగా శ్రేణులను నడిపించారు.
పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాం:
స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చేసిన నిరంతర కృషి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సా హాన్ని నింపింది. పార్టీ ఇచ్చిన బాధ్యతను బాధ్యతగా భావించి, గెలుపే లక్ష్యంగా పనిచేసిన నాయకుడిగా ఆయన మరోసారి తన సమన్వయ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు.
