Anjanna l అభివృద్ధి కావాలంటే అంజన్న గెలవాలి..

Anjanna l అభివృద్ధి కావాలంటే అంజన్న గెలవాలి..

గంధం ఆంజనేయులుకు రోజురోజుకు పెరుగుతున్న ప్రజల మద్దతు

ఒకటో వార్డులో గంధం ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం

Anjanna l మంథని ఆంధ్ర ప్రభ: అభివృద్ధి జరగాలంటే అంజన్న రావాలని ఒకటో వార్డు ప్రజలు చర్చించుకుంటున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటో వార్డు నుంచి పోటీ చేస్తున్న గంధం ఆంజనేయులు ప్రచారంలో దూసుకవెళ్తున్నారు. ఆయనకు ప్రజల మద్దతు రోజురోజుకు పెరుగుతుంది. మోసపోతే గోసపడతాం అనే నినాదంతో గంధం ఆంజనేయులు గడపగడపన ప్రచారం చేస్తున్నారు. ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటెయ్యండి ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుడి వలె ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సహకారంతో ఎన్నికల్లో నిలుచున్నానని, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వస్తున్నానని ఆయన తెలిపారు. గెలిచిన తర్వాత పాలకుడిగా కాకుండా సేవకుడిగా పరిపాలన అందజేస్తానని ఆయన వివరించారు. వార్డు ప్రజలంతా ఆయన ప్రచారానికి ప్రతి ఒక్కరూ అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. గెలిచిన తర్వాత వార్డు సందర్శన కార్యక్రమం ద్వారా వార్డులోని ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply