Vijaya l ప్రజాసేవకే అంకితం.. ప్రజలతోనే జీవితం..

Vijaya l ప్రజాసేవకే అంకితం.. ప్రజలతోనే జీవితం..


53 వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ అభ్యర్థి మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ రావుల విజయ
ఉప్పలయ్య


Vijaya l మంచిర్యాల, ఆంధ్రప్రభ; ప్రజాసేవకే అంకితం ప్రజలతోనే జీవితం53 వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ అభ్యర్థి మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ రావుల విజయ ఉప్పలయ్య స్పష్టం చేశారు. 53వ డివిజన్లో ఉన్న సమస్యలపై నగరపాలక కార్పొరేషన్ లో పరిష్కారాన్ని కృషి చేస్తారని ప్రజా గలమై సమస్యల సాధన చేస్తానని ఉప్పలయ్య తెలిపారు. ప్రజల కోసం పనిచేసే తనని ఎన్నుకోవాలని అర్థించారు. రోడ్ల విస్తరణ మరమ్మత్తులు విద్యుత్ ఆధునికరణ డ్రైనేజీ సిస్టం ఇండ్ల పర్మిషన్లు ప్రభుత్వ పథకాలు సంక్షేమ ఫలాలు ప్రజల దరి చేరారు చేయడమే తమ కర్తవ్యం అన్నారు.

ప్రజా సేవకుడిగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రభుత్వ పథకం ప్రజలకు అందేలా పారదర్శకంగా పనిచేయడం తమ లక్ష్మన్నారు. గతంలో చైర్మన్ చేసిన అనుభవంతో జాఫర్ నగర్ సాయి టెంపుల్ ఏరియా రైల్వే స్టేషన్ వెనుక ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులు జరగాలని వాటి పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. సమస్యల పరిష్కారం ప్రశ్నించే గల తమకు అనుభవంగా ఉందని చెప్పారు. విద్యావంతురాలైన తమ సతీమణి విజయకు సింహం గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని డివిజన్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. యువకుల నుండి అనూహ్యస్పందన వస్తుందని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలపై కౌన్సిలింగ్ సెంటర్ల తో పాటు తగిన ఉద్యోగం అందేలా తమ చర్యలు ఉంటాయన్నారు. తుది శ్వాస ఉన్నంతవరకు 53వ డివిజన్ వృద్ధిలోకి తెచ్చే వరకు నిరంతరం శ్రవిస్తానన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో జాఫర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply