study|విదేశీ చ‌దువు.. ఇక సులువు

study|విదేశీ చ‌దువు.. ఇక సులువు

  • ఎస్సీ విద్యార్థులకు విదేశీ అంబేద్కర్ ఓవర్సీస్ పథకం
  • ఎంపికైతే రూ.20 లక్షల ఉపకార వేతనం అంద‌జేత‌
  • స్కాల‌ర్‌షిప్ కోసం అప్ల‌య్ చేయండిలా..!

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : విదేశీ విద్య పేద‌ల‌కు అంద‌ని ద్రాక్ష‌. పేద కుటుంబాలకు చెందిన‌ పిల్లలు విదేశాల్లో చ‌దువుకోవాల‌నే కోరిక ఉంటుంది. కానీ అది చాలా డ‌బ్బుతో కూడుకున్న‌ద‌ని వెనుక‌డుగు వేస్తుంటారు. టాలెంట్ ఉన్నా ఆర్థిక స్థోమ‌త లేక చాలా మంది విద్యార్థులు చ‌దువును అర్ధంత‌రంగా ఆపేస్తుంటారు. అయితే ఇలాంటివారిని ప్రోత్స‌హించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం విదేశీ అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. షెడ్యూల్ కులాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి రూ.20 లక్షల వరకు ఉపకార వేతనం అందిస్తుంది. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలనుకునే ఎస్సీ విద్యార్థులకు ఈ పథకం కింద రూ.20 లక్షల ఉపకార వేతనం మంజూరు చేస్తామన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఈ మేరకు ములుగు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కొమురయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వీసా,విమాన ప్రయాణ చార్జీలు చెల్లిస్తామన్నారు. అభ్యర్థులు జిఆర్, జిమ్యాట్ లేదా టోపెల్ లలో అర్హత మార్కులతో పాటు డిగ్రీ, పీజీలో 60% మార్కుల సాధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రవేశ పత్రం ఉండాలని సూచించారు. అర్హత కలిగిన వారు మార్చి 31వ తేదీ www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • అర్హులు ఎవరంటే?
  • కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షల లోపు ఉండాలి.
  • ఏదైనా డిగ్రీలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
  • జీఆర్‌ఈ/జీమ్యాట్‌లో అర్హత మార్కులు సాధించాలి.
  • ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్టులో ప్రతిభ.
  • ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థి మాత్రమే అర్హులు.

కావాల్సిన ధ్రువపత్రాలు

  • పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో.
  • బోనాఫైడ్‌ సర్టిఫికెట్‌.
  • ఆధార్, రేషన్‌ కార్డు.
  • స్థానికత ధ్రువపత్రం.
  • పదో తరగతి మెమో.
  • చివరి కోర్సు మార్కుల మెమో.
  • బదిలీ సర్టిఫికెట్‌.
  • జీఆర్‌ఆ/జీమ్యాట్‌/ఇతరస్కోర్‌కార్డు.
  • బ్యాంకు ఖాతా పుస్తకం.
  • విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశ లేఖ.
  • పాస్‌పోర్ట్‌ కాపీ.

Leave a Reply