CM Nara Chandrababu Naidu | సమీక్షా సమావేశం నిర్వహణ …

CM Nara Chandrababu Naidu | సమీక్షా సమావేశం నిర్వహణ …
CM Nara Chandrababu Naidu | తిరుపతి, ఆంధ్రప్రభ : ఏపీ సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశ నిర్వహణలో తిరుపతి జిల్లా కలెక్టర్ డా, ఎస్. వెంకటేశ్వర్, ఎస్పి ఎల్. సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు పాల్గొన్నారు.
జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్షించనున్నారు. 2026-27లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై చర్చించనున్నారు.

నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూయర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతిభద్రతల తదితర అంశాలపై చంద్రబాబు సమీక్షించనున్నారు. సమావేశానికి వర్చువల్ గా తిరుపతి జిల్లా నుండి అధికారులు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, మండల స్థాయిలో తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

