ప్రజా ఆదరణ చూస్తుంటే నిహారిక గెలుపు ఖాయం

ప్రజా ఆదరణ చూస్తుంటే నిహారిక గెలుపు ఖాయం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిహారికను గెలిపించండి
అభివృద్ధికి అండగా ఉంటా
మంత్రి శ్రీధర్ బాబు

మంథని: ప్రజా ఆదరణ చూస్తుంటే నిహారిక గెలుపు ఖాయమని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిహారికను గెలిపించండి, అభివృద్ధికి అండగా ఉంటానని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంథని మున్సిపల్ పరిధిలో తొమ్మిదవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారుపాక నిహారిక నాగరాజు ను గెలిపించండి అభివృద్ధిని మీ ముందు ఉంచుతానని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆమె తరపున మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రచారానికి అడుగడుగున జనాలు బ్రహ్మరథం పట్టారు. మంత్రి శ్రీధర్ బాబు ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు వెళుతూ ఆధ్యాంతం ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి, అభివృద్ధి మరింత చేసి చూపిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థి మారుపాక నిహారిక నాగరాజు మాట్లాడుతూ… గెలిచిన తర్వాత పాలకుల వలె కాకుండా సేవకుల వలె పరిపాలన అందజేస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రజలందరికీ సమన్యాయం అందించడానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఆమె వివరించారు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటెయ్యాలని కోరారు.

Leave a Reply