Collector | ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువలో ఉండాలి..

Collector | ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువలో ఉండాలి..
- అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి…
- రియల్ టైం గవర్నెన్స్ సాంకేతికతను వినియోగించుకోవాలి..
- ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్‌కు, అధికారులకు సూచనలు..
Collector | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : పేద ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని అధికారులంతా అప్రమత్తమై సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు భాగస్వామ్యంతో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ రోజు రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన మంత్రులు, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.
నంద్యాల కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ , అన్ని శాఖల జిల్లాధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వారి ఉద్దేశించి ప్రసంగించారు.జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై సమీక్షించరు.2026-27లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై చర్చించరు.

నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూయర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై సీఎం సమీక్ష చేశారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

