బర్మింగామ్ : ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ మహిళా షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈరోజు (బుధవారం) జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన యున్ కిమ్ చేతిలో 21-19, 13-21, 13-21 తేడాతో ఓడిపోయింది. తొలి గేమ్‌ను పోరాడి గెలిచిన సింధు ఆ తర్వాత పూర్తిగా తేలిపోయి ఇంటి బాట పట్టింది.
మరోవైపు మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్- ట్రిసా జాలీ జోడీ 21-17, 21-13 తేడాతో షౌ యున్ సుంగ్-చెన్ హుయ్ యు (చైనీస్ తైపీ) జంటలను ఓడించి ప్రి క్వార్టర్స్‌లో ప్రవేశించింది.