ప్రచారంలో దూకుడు.. పసల మరియన్న విజయ..

ప్రచారంలో దూకుడు.. పసల మరియన్న విజయ..
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు మున్సిపాలిటీలో 11వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పసల మరియన్న విజయ దంపతులు ప్రచారంలో దూకుడు పెంచారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి.. తాము గత మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయామని.. ఈసారి ఒక్కసారి తమకు అవకాశం కల్పించి.. కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రశ్నించే గొంతుక అవుతామని.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. తమను కౌన్సిలర్ గా గెలిపిస్తే.. 11వ వార్డులో సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకు అంకితం అవుతామని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎల్లుండి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని విన్నవిస్తున్నారు.
