Ootkur | మెరుగైన ఫలితాలు సాధించేందుకు టాలెంట్ టెస్ట్

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : పదవ తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు గత కొన్నేళ్ల నుండి పూసలపాడు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తపస్ మండల అధ్యక్షులు ఎం. కృష్ణ, కార్యదర్శి గోపాల్ అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో పదవ తరగతి విద్యార్థులకు షేర్ కృష్ణారెడ్డి పారిజాత ఆధ్వర్యంలో నిర్వహించిన పూసల్ పహాడ్ టాలెంట్ టెస్ట్ ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్ష 2002 సంవత్సరం నుంచి రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా కొనసాగుతూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు.
జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోటీ పరీక్షలో ఊట్కూర్ మండలం నుండి 215 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వివరించారు. ఈ యొక్క పరీక్ష రాబోవు వార్షిక పరీక్షలకు సన్నాహకంగా ఉండటంతో పాటు విద్యార్థులలో కాంపిటేటివ్ పరీక్షల అవగాహనకు ఎంతో ఉపయోగంగా ఉంటాయని అన్నారు. ఈ పోటీ పరీక్ష ఫలితాలను త్వరలోనే ప్రకటించి విజేతలకు బహుమతులు అందించబడుతుందనిఅన్నారు. ఈ మండలంలో తపస్ దామరగిద్ద కార్యదర్శి కర్ణాకర్ , జిల్లా మీడియా ఇంఛార్జి కిరణ్ నాయకులు , రమేష్, నర్సిములు , కృష్ణ,మహేష్ పాల్గొన్నవారు.
