ఆలేరు నాలుగో వార్డులో తేరాల మంజుల ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డ్ లో బిజెపి అభ్యర్థి తేరాల మంజుల ఆదివారం ఇంటింటి ప్రచారాన్ని మహిళలు, పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోడీ సారథ్యంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ తనను ఆశీర్వదించి గెలిపించాలని మంజుల ఓటర్లను కోరారు.

Leave a Reply