పదవ డివిజన్ లో కారు దెబ్బకు హస్తం కంచుకోట గల్లంతు…
పదవ డివిజన్ లో కారు దెబ్బకు హస్తం కంచుకోట గల్లంతు…
మహబూబ్ నగర్, ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): మహబూబ్‌నగర్ నగర రాజకీయాల్లో పదవ డివిజన్ హాట్‌సీట్‌గా మారింది. కారు అభ్యర్థి నందిపేట శ్రీనివాసులు ప్రచారం దెబ్బకు కంచుకోటలా ఉన్న హస్తం పార్టీ గల్లంతయింది.డివిజన్లో దశాబ్దాలుగా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కనబెట్టి, డబ్బులకే ప్రాధాన్యం ఇచ్చి కొత్త అభ్యర్థికి బీ–ఫారం కట్టబెట్టిన కాంగ్రెస్ నిర్ణయం ఓటర్ల ఆగ్రహానికి కారణమైంది. ఈ అవమానానికి ప్రతిగా ఈసారి కారు గుర్తుకే ఓటు వేసి శ్రీనివాసులును భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలు,కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

ఇక కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి దయనీయంగా మారింది. డబ్బు ధీమాతో ఓటర్లను చిన్నచూపు చూడడం, ప్రజల్లోకి రావడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల డివిజన్లో పూర్తిగా ఒంటరయ్యాడన్న మాటలు వినిపిస్తున్నాయి. “ఎలాగూ కారు గెలుస్తోంది” అన్న నిస్సహాయ భావంతో ప్రచార ఖర్చులకే వెనుకాడుతున్నాడన్న గుసగుసలు కూడ కాంగ్రెస్ శ్రేణుల నుంచే బయటకు వస్తున్నాయి. బిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాసులు కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిన నేతగా పేరుగాంచారు. పిలిస్తే పలికే నాయకుడిగా, కాలనీల అభివృద్ధికి నిత్యం కృషి చేసిన వ్యక్తిగా ప్రజల మన్ననలు పొందారు. ఎవరైనా మృతిచెందితే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడిన మానవీయతే ఈరోజు ఆయనకు అజేయ బలంగా మారింది. ఈ నేపథ్యంతో పదవ డివిజన్లో కారు విజయమే ఖాయమని రాజకీయ విశ్లేషకులు, గ్రౌండ్ సర్వేలు ఘంటాపథంగా చెబుతున్నాయి.
