బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు స్వర్ణకార సంఘం నాయకుల ప్రచారం

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి గెలుపు కోసం స్వర్ణకార సంఘం నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శనివారం రోజు కూరగాయల మార్కెట్ ప్రాంతంలోని స్వర్ణకార సంఘం నాయకుల ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి గెలుపు కోసం వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 15వ వార్డు ఓటర్లు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి వేణుగోపాల మూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్వర్ణకార సంఘం నాయకులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి, స్వర్ణకార సంఘం నాయకులు శంకరాచారి, గుగ్గిళ్ళ రాజు, కోటేశ్వర్, రమేష్,శివారపు రాజు, సత్యనారాయణ, మహ్మద్ ఆజ్మీయ, బిఆర్ఎస్ నాయకులు మహమ్మద్ షబ్బీర్ అలీ, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply