Cricket Board | భారత్ తో టీ 20 మ్యాచ్ బాయ్ కాట్ చేసిన పీసీబీ
Cricket Board | భారత్ తో టీ 20 మ్యాచ్ బాయ్ కాట్ చేసిన పీసీబీ
- భారత్ తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడాలని పీసీబీని కోరిన శ్రీలంక
- పాక్, భారత్ మ్యాచ్ జరగపోతే శ్రీలంకకు భారీ నష్టం వస్తుందన్న ఎస్‌ఎల్‌సీ
- శ్రీలంక అభ్యర్థనపై తమ ప్రభుత్వంతో చర్చలు జరుపనున్న పీసీబీ
Cricket Board | ఆంధ్ర పభ వెబ్ డెస్క్ ; ప్రపంచంలో క్రికెట్ అభిమానులు ఆస్తికిగా చూసే మ్యాచ్ భారత్ , పాకిస్థాన్. అలాంటిది పాకిస్థాన్ ఇండియాతో మ్యాచ్ బాయ్ కాట్ చేసింది. ఇటీవల బంగ్లాదేశ్ లో నెలకొన్న ఘర్పణలతో భారత్ లో బంగ్లాదేశ్ క్రీడాకారులకి రక్షణ లేదని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది. అయినా బంగ్లా క్రికెట్ బోర్డ్ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్‌కప్ నుంచి బంగ్లాను తప్పిస్తున్నట్టు ఐసీసీ అధికారింగా వెల్లడించింది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం కల్పించింది.
అయితే ఈ వివాదం మొదటి నుంచి కూడా బంగ్లాదేశ్ కు పాకిస్థాన్ మద్దతుగా నిలుస్తు వచ్చింది. బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదని, అందరికి ఒకే న్యాయం ఉండాలని. బీసీబీకీ అన్యాయం జరిగితే మేము సైలెంట్‌గా ఉండలేమని బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలుస్తూ 2026 టీ20 లో పాకిస్థాన్, భారత్ తో మ్యాచ్ ఆడదని స్పష్టం చేశారు పీసీబీ. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చింది.
పొట్టి వరల్డ్ కప్‌లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలన్న నిర్ణయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పునరాలోచించాలని అతిథ్య శ్రీలంక కోరింది. దీంతో భారత్ తో మ్యాచ్ ఆడేందుకు పీసీబీ అలోచనలో పడింది. ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించొద్దని కోరుతూ శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) పీసీబీకి ఈమెయిల్ పంపింది. ఈ కీలక మ్యాచ్ రద్దయితే తమ బోర్డుకు గేట్ మనీ, హాస్పిటాలిటీ అమ్మకాల రూపంలో భారీ ఆర్థిక నష్టం వస్తుతుందని ఎస్‌ఎల్‌సీ అధ్యక్షుడు షమ్మీ సిల్వా, పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి విజ్ఞప్తి చేశారు.
శ్రీలంక పాకిస్థాన్‌కు మిత్ర దేశం కాబట్టి మొహ్సిన్ నఖ్వీ, తిరిగి వచ్చాక ఈ విషయాన్ని పాక్ ప్రధాని దృష్టికి తీసుకెళతానని షమ్మీ సిల్వాకు హామీ ఇచ్చారు. త్వరలోనే భారత్ తో మ్యాచ్ ఆడేందుకు పీసీపీ సానూకులంగా స్పందిస్తుందని శ్రీలంక వర్గాలు వెల్లడించాయి
