13వ వార్డులో ప్రచార జోరు గెలుపే లక్ష్యంగా అడుగులు

13వ వార్డులో ప్రచార జోరు గెలుపే లక్ష్యంగా అడుగులు
క్యాతన్,ఫిబ్రవరి 06(ఆంధ్రప్రభ): క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 17వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి సంధ్యారాణి రాజారమేష్ గెలుపు దిశగా ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు.శనివారం సంధ్యారాణి రాజారమేష్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.17వ వార్డులోని ఓటర్లు బిఆర్ఎస్ అభ్యర్థికే మద్దతు తెలుపుతున్నారని వార్డులో పక్క బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగర వేయడం ఖాయమని అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాం లో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేస్తూ ప్రచారం నిర్వహించారు.మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డులో అభ్యర్థి
సంధ్యారాణి రాజారమేష్ లు గెలవడం ఖాయ మని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాముడి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
