మీ ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి..

మీ ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి..

  • బిఆర్ఎస్ 9వ వార్డు అభ్యర్థి బండారి కవిత కృష్ణ

పరకాల, ఆంధ్రప్రభ : మీ ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించాలని 9వ వార్డ్ లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన బండారి కవిత కృష్ణ వార్డులోని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రోజు వార్డులోని ఓటర్లను కలుస్తూ వార్డు సమస్యలు తెలుసుకుంటూ సమస్యలను శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని బిఆర్ఎస్ 9వ వార్డు అభ్యర్థి బండారి కవిత కృష్ణ ఓటర్లకు కోరారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆశీస్సులతో పట్టణంలోని 9వ వార్డులో ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని ఓటర్ల హామీ ఇచ్చారు. పరకాలకు పూర్వ వైభవం రావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. వార్డులో ఇంటింటా పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, ఓటర్ల మద్దతు కోరారు. వార్డులోని ఓటర్లకు ఎల్లవేళల సేవలు చేస్తానని అభ్యర్థి బండారి కవిత కృష్ణ అన్నారు. అభ్యర్థి వెంట బిఆర్ఎస్ నాయకులు, నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply