సమస్యల పరిష్కారం కొరకు బీజేపీని గేలిపించండి

సమస్యల పరిష్కారం కొరకు బీజేపీని గేలిపించండి

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి బీజేపీ అభ్యర్థి కర్నెలక్మీ నర్సయ్యను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి కోరారు. శుక్రవారం ఒకటో వార్డులో ఓటర్లను స్వయంగా కలిసి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. అవినీతి రహిత పాలన కొరకు పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. వార్డుకు చెందిన సమస్యలు సాల్వ్ చేస్తానని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థి నర్సయ్య వేడుకున్నారు. అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. వార్డులో మౌలిక వసతులు కల్పించేందుకు మున్సిపల్ లో గళం విప్పుతానని అన్నారు. ఒకటో వార్డు ఓటర్లు అండగా ఉండి పువ్వు గుర్తుకు ఓటు వేసి విజయం అందించాలని కోరారు.

Leave a Reply