వార్డు సమస్యలు పరిష్కారం చేస్తాను

వార్డు సమస్యలు పరిష్కారం చేస్తాను

భీమ్‌గల్‌ టౌన్, ఫిబ్రవరి 5 ( ఆంధ్రప్రభ ) ఒకటో వార్డు సమస్యలను బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో పరిష్కారం చేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఒకటో వార్డు అభ్యర్తి శెవ్వ అశోక్ అన్నారు. గురువారం ఒకటో వార్డు లో మహిళలు, యువకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కాలనీ ల్లో ప్రశాంత్ రెడ్డి గత పది ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం వివరించారు.

కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన రెండేండ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. దొంగ హామీలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు రాగానే అభివృద్ధి పనుల పేరిట ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఒకటో వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Leave a Reply