ఇంటింటికి గడప గడపకు – జోరుగా కారు ప్రచారం

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీ 10వ వార్డు లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జుట్ల సంగీత సాగర్ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి గడపగడపకు కారు ప్రచారం జోరుగా కొనసాగించారు. ప్రచారంలో సంగీత సాగర్ కు ఓటర్ల నుండి అపూర్వ స్పందన లభించింది. ప్రతి గడపకు వెళ్లి తనకు ఎందుకు మద్దతు ఇవ్వాలి, తాను గెలిస్తే ఏ ఏ పనులు చేపడుతాను అనే అంశాలను ఓటర్లకు వివరిస్తూ మద్దతు కోరారు. 24 గంటలు అందరికీ అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.
అభివృద్ధి సంక్షేమ పథకాలను అందరికీ అందించడమే తన బాధ్యతగా భావిస్తానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తనను ఆదరించి అండగా నిలువ వలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది శూన్యమని అన్నారు. ఒక్కసారి గతానికి ప్రస్తుతానికి అభివృద్ధిలో ఉన్న తేడాను గుర్తించి మరోసారి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం,సైడ్ డ్రైనేజీల ఏర్పాటు వీధిలైట్ల ఏర్పాటు అదే విధంగా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని అందించడమే తన ధ్యేయమని అన్నారు.
.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి మాత్రమే అందించేందుకు కృషి చేస్తానన్నారు .బిఆర్ఎస్ అంటే బడుగుల రాజకీయ పార్టీ అని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి తన అభిమతం అని అన్నారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో ఈ ప్రాంతం అభివృద్ధి కోసం తనను ఆదరించి ఆశీర్వదించి అండగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి మున్సిపల్ కౌన్సిలర్ గా తనను గెలిపించవలసిందిగా 10వ వార్డు ఓటర్లను బిఆర్ఎస్ అభ్యర్థి జుట్ల సంగీత సాగర్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో 10వ వార్డ్ ఇంచార్జి సూతరి రవి కుమార్,జుట్ల సాగర్,గణేష్,బాలు,హరీష్, వెంకటేష్,అనిల్,జాను, నాని,జనార్దన్,పవన్,మహేష్,టిల్లు, అనిల్,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
