అవకాశం ఇవ్వండి అభివృద్ధి పరుస్తా

షాద్ నగర్, ఆంధ్రప్రభ ; అవకాశం ఇవ్వండి 23వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ప్రచారంలో దూసుకుపోతున్న 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అగనూరు బస్వం అన్నారు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓటర్లను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని ఓటర్లను కోరారు ఎమ్మెల్యే వీళ్ళ పల్లి శంకర్లతో కాలనీ హంగాంగా సుందరంగా తీర్చి దిద్దుతానని అన్నారు కాలనీలో ఇప్పటివరకు ఎన్నో మౌలిక సదుపాయాలను చేశామని నీటి సమస్య సిసి రోడ్లు పూర్తిగా పరిష్కరించామని అన్నారు ఇంకా అభివృద్ధి పరిచేది చాలా ఉందని తనకు అవకాశం ఇచ్చి చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తన గెలిపించాలని ఓటర్లను కోరారు