Collector | హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Collector | హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
- సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్
- అన్ని సదుపాయాలు ఉన్నాయన్న విద్యార్థులు
Collector | భీమారం, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం భీమారం లోని ప్రభుత్వ కళాశాల బీసీ హాస్టల్ లో ఆకస్మిక తనకి చేశారు. హాస్టల్ లోని వంట శాల, డైనింగ్ హల్, బెడ్ రూమ్స్ అన్ని రూంలు కలియ తిరుగుతూ కలెక్టర్ విద్యార్థులను ఏమైనా సమస్యలు ఉన్నాయని ఆరా తీశారు. విద్యార్థులు కలెక్టర్ కు సమాధానం ఇస్తూ అన్ని సదుపాయాలు ఉన్నాయి మేడం అని చెప్పడంతో కలెక్టర్ ఆశ్చర్యానికి లోనై అన్ని వసతులు ఉండడం ఏంటని ఏదో ఒకటి లేకుండా ఉంటుంది కదా అని అడిగితే లేదు మేడం అన్ని సదుపాయాలు సక్రమంగా మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అందిస్తుందని తెలపడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం సోషల్ జస్టిస్ డే ను పురస్కరించుకొని కలెక్టర్ మాట్లాడుతూ…. మహిళలలు ఆర్థిక అభివృద్ధిలో భాగం కావాలన్నారు. అందుకోసం చదువు పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. మంచి చదువుతోనే మంచి ఉద్యోగాలు ఆర్థిక స్వేచ్ఛ కలుగుతుందని విద్యార్థులకు అవగహన కల్పించారు.ఈ సందర్బంగా కలెక్టర్ వెంట లో డీబీసీడీఓ,ఏబీసీడీఓ, హాసన్ పర్తి ఎం. ఆర్. ఓ తదితరులు ఉన్నారు.
