చుక్కల మందుతో చక్కటి ఆరోగ్యం
చెన్నూర్, ఆంధ్రప్రభ: చుక్కల మందుతో పిల్లలకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించవచ్చని చెన్నూర్ మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆమె చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణతేజ్ మాట్లాడుతూ.. చెన్నూరు మండల వ్యాప్తంగా మొత్తం 40 పోలియో బూత్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైద్యురాలు అరుణశ్రీ, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
