Kadem | షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థి

Kadem | షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థి

Kadem | కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయానికి చెందిన ఎస్. బ్లెస్సినా, (ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి) జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శకుంతల తెలిపారు. వికారాబాద్ లో ఎస్టీ మార్క్స్ హైస్కూల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ బాలికల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపిక అయినందుకు అభినందిస్తూ, ఈ నెల 7,8,9 తేదీలలో తిరుపతిలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ శకుంతల, పి ఈ టి సునీత, వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి తెలిపారు.

Leave a Reply