Utkoor | సల్లంగా చూడమ్మా ఊర లక్ష్మమ్మ తల్లి.

Utkoor | సల్లంగా చూడమ్మా ఊర లక్ష్మమ్మ తల్లి.

అమ్మ బైలెల్లి నాదో… ఊర లక్ష్మమ్మ బైలెల్లి నాదో…
ఆకట్టుకున్న సామూహిక బోనాల ఊరేగింపు…
వేడుకగా కొనసాగిన ఊర లక్ష్మమ్మ జాతర వేడుకలు…

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : కొలిచిన వారికి కొంగు బంగారంగా బాసిల్లుతున్న గ్రామ దేవత ఊర లక్ష్మమ్మ జాతర వేడుకలు నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఈ రోజు ఎంతో వైభవంగా కొనసాగాయి. బోయిని అమ్మన్న ఇంటి నుంచి పెద్ద బోనంతో డప్పు మేళాల మధ్య మహిళల పూనకంతో తీసుకు వచ్చారు. గ్రామ పురవీధుల గుండా డప్పు మేళా తాళాలతో మహిళలు సామూహిక బోనాలతో బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకోవడంతో పండగ వాతావరణం నెలకొంది. ఆయా పార్టీల నాయకులు యువకులు బోనాల ఊరేగింపులో నృత్యాలు చేస్తూ భక్తుల్లో ఉల్లాసాన్ని నింపారు. ప్రతి ఏడాది రైతులు గ్రామస్తులు ఊర లక్ష్మమ్మ జాతర వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తారు. రైతులకు వివిధ పంటలు చేతికి రావడంతో పాటు యాసంగిలో వేసిన పంటలు పుష్కలంగా పండాలని గ్రామంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతూ అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ.

Utkoor

అందులో భాగంగా ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఊర లక్ష్మమ్మ జాతర వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తారు. రైతులకు వివిధ పంటలు చేతికికి రావడంతో పాటు యాసంగిలో వేసిన పంటలు పుష్కలంగా పండాలని గ్రామంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతూ అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా ప్రజలు ఎంతో భక్తితో తలపై బోనాలతో అమ్మవారి దేవాలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేపట్టిన అనంతరం నైవేద్యం సమర్పించి కోళ్లు, మేకలు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం మంచి నీటి సౌకర్యం టెంట్లు ఏర్పాటు చేశారు. బోనాల ఊరేగింపులు మహిళల పూనకం, నాయకులు యువకుల నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. జాతర సందర్భంగా వివిధ దుకాణాలు వెలిశాయి. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షించారు. డీజే ఆటపాటలతో నాయకులు భక్తులు నృత్యాలు చేసి భక్తులను విశేషంగా ఆకట్టుకోగా ఉమ్మడి జిల్లా జోగిని వ్యతిరేక పోరాట సమితి హాజమ్మ డప్పు కొట్టి భక్తుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఆలయానికి ఉచితంగా కలర్లు అందజేసినఎం.రాహుల్ తోపాటు హంపి పీఠాధిపతిశ్రీ విద్యారణ్య భారతి శిష్యుడు పీవీ నరసింహా రెడ్డి ఉచితంగా కలర్లు వేయడంతో ఆలయం తరఫున ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గరిడి నింగి రెడ్డి, సర్పంచ్ రేణుక భరత్, ఉప సర్పంచ్ రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు యగ్నేశ్వర్ రెడ్డి, మాజీ సూర్య ప్రకాశ్ రెడ్డి, అరవింద్ కుమార్, మాజీ సర్పంచ్ భాస్కర్, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఎల్కోటి నారాయణ రెడ్డి, జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గరిడి లక్ష్మారెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు హన్మంతు, కార్యదర్శి శివారెడ్డి, నిర్వాకులు ఆనంద్ రెడ్డి, బసిరెడ్డి, జగదీష్ గౌడ్, నాయకులు ఎల్కోటి జనార్ధన్ రెడ్డి, ఎం. శేషప్ప, మోహన్ రెడ్డి, కుర్వఆశప్ప, ఎం విజయ్ కుమార్, కొండన్ గోపాల్, భరత్, రోషనప్ప తదితరులు పాల్గొన్నారు.